భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:11 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భారత ఆర్థిక వ్యవస్థపై, సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు నిండుకున్నాయని, మరో 25 రోజులకు సరిపయే ఇంధనం మాత్రమే ఉందని వార్తలు వస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భారత ఆర్థిక వ్యవస్థపై, సరఫరా గొలుసుపై ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు నిండుకున్నాయని, మరో 25 రోజులకు సరిపోయే ఇంధనం మాత్రమే ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. భారత్ వద్ద ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్ల (దాదాపు 4 వేల కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని స్పష్టం చేసింది (India crude oil reserves).
విశాఖపట్నం, మంగళూరు, పడూర్ మొదలైన వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్‌లైన్లు, ట్యాంకులు, సముద్ర నౌకల్లో దాదాపు 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం సరఫరా వ్యవస్థలో ఉన్న చమురు ఉత్పత్తులు దాదాపు రెండు నెలల అవసరాలకు సరిపోతాయని తెలిపింది. ప్రస్తుతం భారత్ 40 దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందని, అందులో 40 శాతం మాత్రమే హోర్ముజ్ జలసంధి మీదుగా వస్తోందని వెల్లడించింది. మిగతా 60 శాతం చమురు రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా తదితర మార్గాల ద్వారా భారత్‌కు చేరుకుంటోందని తెలిపింది (India energy security).
అదనపు ముడి చమురు కోసం రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో మన దేశ రిఫైనరీలు చర్చలు జరుపుతున్నట్టు కేంద్రం తెలిపింది (Petroleum reserves India). రష్యా చమురు దిగుమతులపై అమెరికా మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో హెచ్‌పీసీఎల్, రిలయన్స్ వంటి ప్రధాన కంపెనీలు మళ్లీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో చమురు నిల్వల గురించి ఆందోళన చెందనక్కర్లేదని తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి..
ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్