1647 మంది వైద్యులకు సీజీఎస్ పోస్టింగ్‌లు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:36 AM
కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ (సీజీఎస్) కింద ఏడాది పాటు సేవలందించాల్సిన 1,647 మంది పీజీ వైద్యులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు కేటాయించింది.
మెరిట్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా స్థానాల కేటాయింపు
కౌన్సెలింగ్ పోర్టల్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్లు
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ (సీజీఎస్) కింద ఏడాది పాటు సేవలందించాల్సిన 1,647 మంది పీజీ వైద్యులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు కేటాయించింది. అభ్యర్థుల మెరిట్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా స్థానాలను ఖరారు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకడమిక్) డాక్టర్ ఎం.రమాదేవి వెల్లడించారు.
అభ్యర్థులు కౌన్సెలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి అలాట్‌మెంట్ ఆర్డర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లేదా డైరెక్టర్ వద్ద సకాలంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పాలీక్లినిక్‌లకు కేటాయించిన వైద్యులు వాటికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనని, ఆప్షన్లు ఇవ్వని వారికి మిగిలిన ఖాళీల్లో రాండమ్ పద్ధతిలో పోస్టింగ్‌లు కేటాయించారు. నియమితులైన వైద్యులంతా తమకు కేటాయించిన బోధనాస్పత్రుల్లో ఏడాది పాటు వైద్య సేవలందించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News