హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:10 AM
హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్’ పిలుపు నేపథ్యంలో నగర ట్రాఫిక్ వ్యవస్థపై ప్రభావం పడనుంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో పాటు పలు ప్రధాన రూట్లలో వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అక్టోబర్ 8: ‘చలో లోక్‌భవన్’ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. లోక్‌భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు పలు ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. సెక్రటేరియట్ జంక్షన్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి ఆయా మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో సెక్రటేరియట్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇక మింట్ కాంపౌండ్ లేన్.. ఖైరతాబాద్ మార్గాల్లోనూ వాహనాల రాకపోకలను అవసరాన్ని బట్టి మళ్లించనున్నారు. ఇందిరా రోటరీ, ఇక్బాల్ మినార్, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వాహనాలను దారి మళ్లించేలా ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసులు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
Read Latest Telangana News And AP News