Share News

హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:21 PM

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగులరాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం
Hyderabad Crime News

హైదరాబాద్, జూన్ 24: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నదివ్యాంగురాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలికి మాట్లాడే, వినే శక్తి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళ మెడ, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 04:41 PM