Share News

హైదరాబాద్ కాచిగూడలో ప్రమాదం.. మహిళ మృతి

ABN , Publish Date - Jul 28 , 2026 | 02:59 PM

హైదరాబాద్ కాచిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో స్కూటీ అదుపుతప్పి బస్సు కిందపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

హైదరాబాద్ కాచిగూడలో ప్రమాదం.. మహిళ మృతి
Hyderabad Road Accident

హైదరాబాద్, జులై 28: కాచిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో స్కూటీ అదుపుతప్పి బస్సు కిందపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.


సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..

Updated Date - Jul 28 , 2026 | 03:45 PM