పెళ్లిలో ఊహించని పరిణామం.. భార్య ఎంట్రీతో..
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:11 PM
ఓ పెళ్లిలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వరుడి భార్య ఎంట్రీతో పెళ్లి మండపంలో చిన్నపాటి యుద్ధమే జరిగింది. పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ పెళ్లిలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వరుడి భార్య ఎంట్రీతో పెళ్లి మండపంలో చిన్నపాటి యుద్ధమే జరిగింది. పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఆసిఫ్ మహ్మద్, సహానాకు ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2022లో ఇరు కుటుంబాలను ఒప్పించి ఇద్దరూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, 2024 నుంచి మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సహానా కోర్టును ఆశ్రయించింది. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం కోర్టులో పిటిషన్ వేసింది. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. ఇలాంటి సమయంలో భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని సహానాకు తెలిసింది. శుక్రవారం పోలీసులను వెంటబెట్టుకుని పెళ్లి జరుగుతున్న చకేరిలోని చౌదరీ మ్యారేజ్ లాన్‌కు వెళ్లింది. అక్కడ సహానా పెళ్లి కూతురితో గొడవ పెట్టుకుంది. ‘నేను ఎవరో తెలుసా? నేను అతడి భార్యను. అతడు నాకు విడాకులు ఇవ్వలేదు. నేను ఈ పెళ్లి జరగనివ్వను’ అంటూ పెళ్లి కూతురిపై ఫైర్ అయింది.
ఈ నేపథ్యంలోనే అసిఫ్ అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని ఆపి స్టేషన్‌కు తీసుకెళ్లారు. సహానాతో పెళ్లి, గొడవల గురించి అతడిని విచారించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇక, ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: భారత షూటర్ల హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం