Share News

హైదరాబాద్‌లో గణేశ్ ఆగమన్ కార్యక్రమంలో తొక్కిసలాట.. విద్యార్థి మృతి

ABN , Publish Date - Sep 06 , 2026 | 09:24 AM

గణపతి నవరాత్రులు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘గణేశ్ ఆగమన్’ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఓ విద్యార్థి మృతి చెందాడు.

హైదరాబాద్‌లో గణేశ్ ఆగమన్ కార్యక్రమంలో తొక్కిసలాట.. విద్యార్థి మృతి
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ చౌరస్తాలో విషాదం చోటుచేసుకుంది. గణపతి నవరాత్రులు రానున్న నేపథ్యంలో స్థానిక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గణేశ్ ఆగమన్’ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ విద్యార్థి మృతి చెందాడు.


ముషీరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో ‘శ్రీ గణపతి యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ కార్యక్రమం కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా ఒక్కసారిగా గూమిగూడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో బద్రీనాథ్(19)అనే విద్యార్థి మృతి చెందారు. రాంనగర్‌లోని గౌరీశంకర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న బద్రీనాథ్.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.


బద్రీనాథ్ నగరంలోని అబిడ్స్‌లో మెథొడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్‌‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గద్వాల్‌లో లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Sep 06 , 2026 | 09:25 AM