Share News

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఆ కిచెన్లను చూసి షాక్

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:21 PM

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనేక చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఆ కిచెన్లను చూసి షాక్
Hyderabad Food Safety Raids

హైదరాబాద్, జూన్ 28: నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలోని ప్రముఖ రెస్టారెంట్లలో సైబరాబాద్ కమిషనరేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో సైబరాబాద్ సీవీఎంసీ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఆహార భద్రత, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల్లో తీవ్ర లోపాలు బయటపడటంతో పలువురు రెస్టారెంట్ యాజమాన్యాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.


గచ్చిబౌలిలోని షా గౌస్ రెస్టారెంట్‌లో ఈగలు తిరుగుతూ ఉండటం, వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, తెరిచి ఉన్న డ్రెయిన్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. పరిశుభ్రత ప్రమాణాల్లో కేవలం 65 శాతం హైజీన్ రేటింగ్ రావడంతో యాజమాన్యానికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. సిబ్బందికి అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా లేకపోవడాన్ని గుర్తించారు. ఈ రెస్టారెంట్‌కు హైజీన్ రేటింగ్‌లో 67 శాతమే రావడంతో నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఐడియల్ కిచెన్‌లో ఫ్రీజర్‌లో నిల్వచేసిన పిండివంటలపై బొద్దింకలు కనిపించగా, మినప్పప్పులో పురుగులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ముడి పదార్థాల నిల్వలోనూ తీవ్ర లోపాలు బయటపడటంతో 67 శాతం హైజీన్ స్కోర్ నమోదు చేసి ఈ సంస్థకు కూడా ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందజేశారు.

కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్‌లో లేబుల్ ట్యాంపరింగ్, గడువు ముగిసిన మష్రూమ్స్ నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. పాత ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించడంతో పాటు తుప్పుపట్టిన ఫ్రీజర్లు, ఈగలతో నిండిన వంటగదిని పరిశీలించారు. ఈ రెస్టారెంట్‌కు కేవలం 60 శాతం హైజీన్ రేటింగ్ రావడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 04:01 PM