జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్య ముఖాన్ని టవల్‌తో చుట్టి, ఊపిరాడకుండా చేసి..
ABN , Publish Date - Sep 16 , 2026 | 02:57 PM
ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది.
జగిత్యాల, సెప్టెంబర్ 16: జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్య ముఖాన్ని టవల్‌తో చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పడేసి పరారయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నం నరేశ్, లక్ష్మి దంపతులు జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ప్రకాశం రోడ్డులో నివాసముంటున్నారు. నరేశ్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తుండగా.. లక్ష్మి స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా ఉద్యోగం చేస్తోంది. కాగా, నరేశ్.. భార్య లక్ష్మి ముఖాన్ని టవల్‌తో చుట్టేసి ఊపిరిరాడకుండా చేసి హత్య చేసి, పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
Read Latest Telangana News And Telugu News