ఎర్రవల్లిలో మూడో రోజు ముమ్మరంగా కొనసాగుతున్న భూముల రీ-సర్వే
ABN, Publish Date - Sep 19 , 2026 | 01:56 PM
సిద్దిపేటలోని ఎర్రవల్లి పరిధిలో సర్వే నంబర్ 325 భూముల రీ-సర్వే మూడో రోజుకు చేరుకుంది. రెవెన్యూ, సర్వే అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చెరువు, గుట్ట ప్రాంతాలు, కాలువల హద్దులను గుర్తిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి పరిధిలో సర్వే నంబర్ 325 భూముల రీ-సర్వే మూడో రోజు ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పాండవుల చెరువు, గుట్ట ప్రాంతాలు, కాలువల హద్దులను క్షేత్రస్థాయిలో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తిస్తున్నారు. మరోవైపు శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన 113 ఎకరాల భూమి విలీనంపై గ్రామస్థులు స్పందిస్తూ పాత రికార్డుల ప్రకారం న్యాయం చేయాలని కోరుతున్నారు. సర్వే నివేదిక ఆధారంగా రైతులకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి.
ఇవీ చదవండి
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Updated at - Sep 19 , 2026 | 02:00 PM