Share News

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

ABN , Publish Date - Jan 09 , 2026 | 08:41 AM

సనత్‌నగర్‌ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్: ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీమంత్రి, సనత్‌నగర్‌ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanathnagar Member of the Legislative Assembly Talasani Srinivas Yadav) ఆరోపించారు. గురువారం పద్మారావునగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్‌ను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ఈ నెల 11వ తేదీన బాలంరాయిలోని లీ ప్యాలెస్‏లో ప్రజాప్రతినిధులు,


మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార, కార్మిక సంఘాలు, పలు కాలనీలు, బస్తీల కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఈ నెల 17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఎంజి రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని అన్నారు. సికింద్రాబాద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేవరకు ర్యాలీలు,


city5.jpg

ధర్నాలు, రాస్తారోకో, ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని తలసాని హెచ్చరించారు. ఇది ఒక పార్టీకి సంబం ధించిన పోరాటం కాదని, సికింద్రాబాద్‌ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబం ధించిన పోరాటంగా పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఈ ప్రాంత చరిత్రను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2026 | 08:41 AM