Share News

Khammam News: 18న ఏదులాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:39 PM

ఈనెల 18వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా ఏదులాపురానికి విచ్చేస్తున్నారు. అక్కడ జరిగే ఆయా పనులకు ఆయన శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లాలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొననున్నారు.

Khammam News: 18న ఏదులాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

- మున్సిపాలిటిలో అభివృద్ధి పనుల ప్రారంభానికి హాజరు

ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొననున్నారు. అదేరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్‌ యార్డ్‌, రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌ కళాశాల ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రూ.108 కోట్లతో నిర్మించబోయే జేఎన్‌టీయూ భవన నిర్మాణానికి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.


revan1.jpg

అనంతరం బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. అందులో భాగం గా మద్దులపల్లి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని సీపీ సునీల్‌దత్‌, ఏదులాపురం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ పిల్లి.రాంప్రసాద్‌, మార్కెట్‌ చైర్మన్‌ హరినాదబాబులు మంగళవారం పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 01:39 PM