Share News

Hyderabad: నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్: సీఎం రేవంత్

ABN , Publish Date - Jan 10 , 2026 | 09:24 PM

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ‌లో జరిగిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..

Hyderabad: నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్: సీఎం రేవంత్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్‌: ఈరోజు (శనివారం) హెచ్ఐసీసీ (HICC)లో జరిగిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’ (Fellows India Conference) ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను వైద్యుడిని కాకపోవచ్చు, కానీ సమాజంలోని సమస్యలను, రుగ్మతలను గుర్తించి పరిష్కరించే సోషల్ డాక్టర్ అని అన్నారు. రాజకీయ నాయకులు సమాజ ఆరోగ్యాన్ని కాపాడాలని, వైద్యులు(Doctor) ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల (Super specialty hospitals) నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వైద్యులు తమ పరిశోధనల ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందేలా చూడాలని ఆయన కోరారు.


మీ నాలెడ్జ్‌(Knowledge)ని అప్ గ్రేడ్ చేసుకోవడంతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కాన్ఫరెన్స్(Conference)కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్ కు ముగింపు పలికినట్లే అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌ (Hyderabad)లో జరగడం ఎంతో గర్వకారణమని.. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజల ప్రాణాలను డాక్టర్లు కాపాడుతారని ప్రతిఒక్కరూ ఎంతో బలంగా నమ్ముతారని రేవంత్ రెడ్డి అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తమ పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హైటెక్నాలజీతో ముడిపడి ఉంటుందని అన్నారు. ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని.. అలాంటి సమయంలో బాధితులను ఎలా రక్షించాలో విద్యార్థులకు CPR బోధించాలని రేవంత్ రెడ్డి హితవుపలికారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని అందరినీ కోరుతున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్‌ కసిరెడ్డి..

వైసీపీ పాలనలో అవినీతికి సాక్ష్యం ఇదే: మంత్రి సుభాశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 10:10 PM