Share News

భారత్‌ వ్యతిరేకులతో భేటీయా?

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:12 AM

అమెరికా పర్యటనలో భారత్‌ వ్యతిరేక శక్తులతో భేటీ కానున్నట్లు అందిన సమాచారం వల్లే సీఎం రేవంత్‌రెడ్డికి అగ్రరాజ్య పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు చెప్పారు.

భారత్‌ వ్యతిరేకులతో భేటీయా?
Rama chandra rao

  • అందుకే అమెరికాలో సీఎం పర్యటనకు నో

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌: అమెరికా పర్యటనలో భారత్‌ వ్యతిరేక శక్తులతో భేటీ కానున్నట్లు అందిన సమాచారం వల్లే సీఎం రేవంత్‌రెడ్డికి అగ్రరాజ్య పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు చెప్పారు. గతంలో 2సార్లు అమెరికాకు, లండన్‌, దావోస్‌, సింగపూర్‌లకెళ్లినప్పుడు ఆయన పర్యటనకు అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫీజు బకాయి- బీజేపీ లడాయి దీక్షా శిబిరం వద్ద ఆయన మీడియాతో వ్యూహాత్మక భాగస్వామి ఎవరో వెల్లడించనందునే సీఎం రేవంత్‌ యూఎస్‌ పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎంలు, మంత్రులు విదేశాలకెళితే.. ఎవరెవరిని కలుస్తారన్న విషయమై ప్రొటోకాల్స్‌ ఉంటాయన్న రాంచందర్‌రావు.. ‘న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ వంటి భారత వ్యతిరేక శక్తులతో మీరు కలవాల్సిన అవసరమేంటి?ఆయనతో భేటీ కావాలని రాహుల్‌ చెప్పారా? దేశ ద్రోహులతో భేటీలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎందుకు అనుమతిస్తుంది?’ అని నిలదీశారు. పర్యటన ప్రణాళిక ఇవ్వకుండా కళ్లు గప్పడానికి ప్రయత్నించినందుకు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

అజిత్‌ డోభాల్‌కు త్వరలో స్థానచలనం

జైలుకు సైకో సాదిక్‌.. 14 రోజులు రిమాండ్‌

Updated Date - Aug 25 , 2026 | 06:12 AM