భూపాలపల్లి సింగరేణి గనిలో పేలిన మందుగుండు.. తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jun 15 , 2026 | 10:54 AM
జిల్లాలోని సింగరేణి సంస్థకు చెందిన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీకే) 5వ గనిలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 15: జిల్లాలోని సింగరేణి సంస్థకు చెందిన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీకే) 5వ గనిలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గని లోపల బొగ్గు ఉత్పత్తి పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా ఊహించని విధంగా మందుగుండు చేతిలోనే పేలిపోయింది. ఈ ఘటనలో శ్రీరాముల ప్రదీప్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గని అంతర్భాగంలోని 13వ లెవెల్‌లో బొగ్గును వెలికితీసేందుకు మందుపాతరలు అమర్చి బ్లాస్టింగ్ ప్రక్రియను చేపట్టారు. అయితే, ఆ సమయంలో మందుగుండు హఠాత్తుగా చేతిలోనే పేలడంతో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న తోటి కార్మికులు అప్రమత్తమై, తీవ్ర రక్తస్రావంతో ఉన్న ప్రదీప్‌ను.. భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సింగరేణి ఉన్నతాధికారులు.. గని వద్దకు చేరుకుని సమగ్ర విచారణను ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీల రద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News