బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద విషాదం..
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:40 PM
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమావదశాత్తూ గోదావరి నదిలో గల్లంతయ్యారు.
నిర్మల్ జిల్లా: బాసరలో ఇవాళ (మంగళవారం) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమావదశాత్తూ గోదావరి నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్ బజార్‌కు చెందిన ఓ కుటుంబం.. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. అయితే, దర్శనానికి ముందు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కుటుంబ సభ్యులు గోదావరి నదిలోకి దిగారు.
లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో బాధిత కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కాగా, గల్లంతైన చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (31) అన్నదమ్ములుగా తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన గజ ఈతగాళ్లు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్నదమ్ములు ముగ్గురు నీటిలో ముగినిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని సురక్షితంగా కాపాడాలని అమ్మవారిని వేడుకుంటున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క