Share News

ఆ ప్రాజెక్టుల నుంచి ఇక తాగునీరే!

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:43 AM

నిర్మల్‌ జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వల సామర్థ్యం బాగా తగ్గిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆ ప్రాజెక్టుల నుంచి ఇక తాగునీరే!
SRSP

  • ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదల బంద్‌

  • 9న కడెం నుంచి, మరో వారంలో స్వర్ణ నుంచి కూడా..

  • ఆ రైతుల్లో ఆందోళన.. డిసెంబరు దాకా నీళ్లివ్వాలని వినతి

నిర్మల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వల సామర్థ్యం బాగా తగ్గిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీరాంసాగర్‌, కడెం, స్వర్ణ నుంచి సాగుకు నీరును నిలిపవేయాలని, ఆ ప్రాజెక్టుల నుంచి మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలకే నీటిని అందించాలని నిర్ణయించారు. కడెం ప్రాజెక్టు కింద సాగవుతున్న పంటలకు 9వ తేదీన నీటిని నిలిపివేయనున్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న 2.160 టీఎంసీల నీటిని వచ్చే ఏడాది మే నెల దాకా తాగునీటి అవసరాల కోసం వాడనున్నారు. ఎస్సారెస్పీ పరిఽధిలో 38వేల ఎకరాలకు సాగునీరు అందించే సరస్వతీ కాలువకు కూడా గురువారమే నీటిని నిలిపివేశారు.


ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం 34.81 టీఎంసీల మేర నీరు ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం కోరుట్ల, జగిత్యాల జిల్లాలకు 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు 63 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు ప్రతిరోజూ 107 క్యూసెక్కుల నీటిని మిషన్‌ భగీరథ కోసం సరఫరా చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు కూడా ఈ నెల రెండో వారం నుంచి నీటి సరఫరాను నిలిపివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా అఽధికారుల ప్రకటన అనంతరం కడెం ప్రాజెక్టు కింద వరి సాగు చేసిన దస్తురాబాద్‌, దేవునిగూడెం, రాంపూర్‌, భూత్కూర్‌ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి తాము ఆలస్యంగా ఆగస్టు చివరిదాకా నాట్లు వేశామని.. ప్రస్తుతం పైరు పొట్టదశలో ఉందని, సాగునీరు నిలిపివేస్తే పంట చేతికిరాదని, పెట్టుబడి ఖర్చులు మీద పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు మొదటి వారం వరకు సాగునీరు అందించి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 06:43 AM