Share News

పగలు ఉక్కపోత.. రాత్రి చలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:58 PM

జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది.

పగలు ఉక్కపోత.. రాత్రి చలి

  • జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు

  • మధ్యాహ్నం వేళ 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

కాగజ్‌నగర్‌టౌన్‌(ఆదిలాబాద్): జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ మిశ్ర మ వాతావరణంతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంటున్నాయి. తెల్లవారుజామున తేలికపాటి చల్లని గాలి వీస్తు కొంత చలి వాతావరణం కనిపిస్తోంది.


మధ్యాహ్నం అయ్యే సరికి ఎండ తీవ్రతతో ఉక్కపోత ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 37 డిగ్రీలు వరకు చేరుకుంటోంది. గతంలో కూడా మార్చి లో 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదు అయిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఉం టోంది. వచ్చే వారంలోగా మరింత ఎండ తీవ్రత పెరి గే అవకాశాలున్నాయని తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.


మొత్తంగా చూస్తే వారం రోజులుగా సుమారు 16-20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, గరిష్ఠంగా 33-37 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు లేకు న్నా, ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో మంచినీ టిని ఎక్కువగా తీసుకోవాలని, నియమాలను పాటిస్తే వాతావరణంలో మార్పుల నుంచి వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.


zzzzzz.jpg

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉండేందుకు రోజులో తగినంత నీటిని తీసుకోవాలి.

  • బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

  • కొబ్బరినీళ్లు మజ్జిగ, నిమ్మరసం, ప్రకృతి ఉత్పత్తులు తీసుకోవాలి.

  • పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకు కూరలు, సలాడ్స్‌ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

  • పగటి పూట టోపి, కళ్లజోడు ధరించాలి.

  • వ్యాయామం, యోగా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


వారంలో జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ కనిష్ఠం గరిష్ఠం

ఫిబ్రవరి 27 16 33

ఫిబ్రవరి 28 17 34

మార్చి 1 18 35

మార్చి 2 18 35

మార్చి 3 19 36

మార్చి 4 19 36

మార్చి 5 20 37


ఈ వార్తలు కూడా చదవండి:

వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు

బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2026 | 01:58 PM