వైద్యశాలలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.. స్వయంగా చీపురు పట్టి ఊడ్చిన వైనం!
ABN , Publish Date - Mar 07 , 2026 | 08:39 PM
పరిశుభ్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం దహెగాం మండలం కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
కొమరంభీం, మార్చి 7: పరిశుభ్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం దహెగాం మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో అయితే ఇలాగే ఉంచుతారా? అని సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రి పనితీరును, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వార్డులో, ఆసుపత్రి ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటం గమనించి స్వయంగాచీపురు పట్టి ఊడ్చారు. రోగులు కోలుకోవాల్సిన చోట ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ ఆసుపత్రి పరిసరాలను పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా ఆమె స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేయడం చూసి రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా విస్తుపోయారు. వేంటనే ఆమెతో కలిసి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే
‘మద్య నిషేధం’ హామీ వెనక నిజమైన స్టోరీ ఇదేనా.. జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న
Read Latest Telugu News