‘మద్య నిషేధం’ హామీ వెనక నిజమైన స్టోరీ ఇదేనా.. జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:43 PM
2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ‘మద్య నిషేధం’ హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా అంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో సంచలన పోస్టు చేశారు.
అమరావతి, మార్చి 7: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM Jagan Mohan Reddy), గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన మద్య నిషేధం హామీ గురించి ప్రస్తావిస్తూ.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్ చేశారు. ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు అటాచ్ చేసిన మంత్రి.. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ‘మద్య నిషేధం’ హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా అంటూ వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్ ట్వీట్ ఇదే
‘ప్రతి నెలా రూ.100 కోట్లు కిక్‌బ్యాగ్స్, రూ.3,500 కోట్లు మనీ లాండరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిన రూ.1,048 కోట్ల లావాదేవీల జాడ ఎక్కడ’ అని ప్రశ్నించారు. ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు అటాచ్ చేసిన లోకేశ్... ‘2019 ఎన్నికల్లో జగన్ మీరు ఇచ్చిన మద్య నిషేధం హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా. మీరు మద్య నిషేధం గురించి ప్రసంగిస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం వేలాది కుటుంబాలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నాశనం చేసింది. ఇదే టైంలో మీ అనుచరుల జేబులు వేల కోట్ల రూపాయలతో నిండిపోయాయి. ఏపీ ప్రజలకు మీరు సమాధానం చెబుతారా? లేక మౌనంగా ఉండడమే మంచిదని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు #LiquorScamByJagan, #ScamStarJagan హ్యాష్‌ట్యాగ్‌లను మంత్రి లోకేశ్ జత చేశారు.
ఇవి కూడా చదవండి...
దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే
Read Latest AP News And Telugu News