Share News

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:13 PM

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చిరంజీవికి హృదహపూర్వక అభినందనలు తెలియజేశారు.

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే
Deputy CM Pawan Kalyan

అమరావతి, మార్చి 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను(Gaddar Film Awards 2025) ప్రకటించింది. ఈ అవార్డుల్లో అత్యున్నతమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం(NTR National Award) మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chirangeevi) ప్రకటించారు. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.


‘అన్నయ్య, అగ్రశ్రేణి కథానాయకులు చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమలో అన్నయ్య చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.


అలాగే, పైడి జైరాజ్ అవార్డుకు కమల్ హాసన్, బి.ఎన్. రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాస రావు, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డుకు అశ్వినీ దత్, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేష్ ప్రసాద్, కాంతారావు అవార్డుకు ఆర్. నారాయణమూర్తి, సి. నారాయణరెడ్డి (సినారే) అవార్డుకు సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) అవార్డుకు జయసుధ ఎంపికయ్యారు. వీరందరికీ పవన్ అభినందనలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వారు అందించిన సేవలు విలువైనవన్నారు. గద్దర్ పురస్కారాలకు ఎంపికైనవారికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 03:28 PM