Gmail Tips: జీమెయిల్ వాడుతున్నారా? ఈ 10 ట్రిక్స్ తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:06 PM
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జీమెయిల్‌ని వినియోగిస్తున్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే దాని స్మార్ట్ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. మరి జీమెయిల్‌లో ఉన్న 10 ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రజ్యోతి: ప్రపంచ వ్యాప్తంగా 1.8 బిలియన్లకు పైగా వినియోగదారులు జీమెయిల్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ.. దాని గురించి పూర్తి తెలిసిన వారు.. జీమెయిల్ ఫీచర్స్‌ను వినియోగించుకునే వారు చాలా తక్కువ మందే అని చెప్పాలి. మీరు జీమెయిల్ ఆధారంగా పని చేస్తున్నట్లయితే.. మీ పని విధానాన్ని పూర్తిగా మార్చేసే 10 సీక్రెట్ టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్స్ ద్వారా మీ సమయం ఆదా అవడంతోపాటు.. జీమెయిల్‌ని సరైన రీతిలో ఉపయోగించవచ్చు.
1. అన్‌డూ..
మీరు ఎప్పుడైనా అనుకోకుండా అసంపూర్ణంగా ఇమెయిల్‌ని పంపించారా? అయితే, వెంటనే ‘అన్‌డూ’ క్లిక్ చేయండి. మీరు ఇమెయిల్‌ను పంపిన తరువాత దానిని క్యాన్సిల్ చేయడానికి మీకు 30 సెకన్ల సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో దానిని అన్‌డూ క్లిక్ చేస్తే.. ఆ మెయిల్ సెంట్ అవ్వదు.
2. ప్రమోషనల్ మెయిల్స్‌ను తొలగించాలి..
మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో అనవసరమైన ప్రకటనలకు సంబంధించి మెయిల్స్ చిరాకు తెప్పిస్తే.. సర్చ్ బార్‌లో ‘unsubscribe’ అని టైప్ చేయండి. అప్పుడు అన్ని మార్కెటింగ్ ఇమెయిల్స్ ఒకే చోటకు వస్తాయి. వాటన్నింటినీ ఒకేసారి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది.
3. కాన్ఫిడెన్షియల్ మోడ్..
మీరు ఎవరికైనా సున్నితమైన సమాచారాన్ని పంపిస్తున్నట్లయితే.. ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ని ఉపయోగించండి. ఇమెయిల్ కంపోజ్ చేస్తున్నప్పుడు లాక్ సింబల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఎవరికైతే మీరు మెయిల్ పంపుతారో వారు మీ సందేశాన్ని కాపీ చేయడం, ఫార్వార్డ్ చేయడం, ప్రింట్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
4. ఇంటర్నెట్ లేకుండా జీమెయిల్ వినియోగం..
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా ఇమెయిల్‌లను చదవవచ్చు. అలాగే డ్రాఫ్ట్‌లను కూడా రాయొచ్చు. దీనికోసం.. సెట్టింగ్స్‌లో ఆఫ్‌లైన్ మోడ్‌ని స్టార్ట్ చేయాలి. ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినప్పుడు మీరు చేసిన మార్పులు ఆటోమాటిక్‌గా రీసెట్ అవుతాయి.
5. ఇమెయిల్‌లను షెడ్యూల్ చేయడం..
మీరు రాత్రి ఆలస్యంగా పని చేస్తూ, ఉదయం మీ ఇమెయిల్ సమయానికి రావాలనుకుంటే.. ఆ ఇమెయిల్‌ను షెడ్యుల్ చేయొచ్చు. వివిధ టైమ్‌లలో పని చేసే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోపడుతుంది.
6. ఇమెయిల్‌లను తాత్కాలికంగా ఆపివేయడం..
అలారంను తాత్కాలికంగా ఆపేసినట్లుగానే.. ఇమెయిల్‌లను కూడా తాత్కాలింగ ఆపేసే అవకాశం ఉంది. ఇక ఇమెయిల్ మీకు ఇంపార్టెంట్ కాదనుకోండి.. మీరు దానిని తాత్కాలికంగా ఆపేసే అవకాశం ఉంది. ఆ ఇమెయిల్‌ను ఇన్‌బాక్స్ నుంచి తాత్కాలికంగా తొలగిపోయి.. మీరు ఏదైతే సమయం సెట్ చేస్తారో ఆ సమయంలో మళ్లీ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తుంది.
7. లేబుల్‌లతో ఇమెయిల్‌లను పంపించండి..
జీమెయిల్‌లో ఫోల్డర్‌లకు బదులుగా లేబుల్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఆఫీస్, ట్రావెల్, పర్సనల్ వంటి కస్టమ్ లేబుళ్లను క్రియేట్ చేయడం ద్వారా మీ ఇమెయిల్స్ కేటగిరీలుగా డివైడ్ చేసుకోవచ్చు.
8. ఇమెయిల్ టెంప్లేట్ క్రియేట్ చేయండి..
మీరు ఒకే రిప్లేను పదే పదే పంపుతున్నట్లయితే.. దానిని టెంప్లేట్‌గా సేవ్ చేసుకోండి. ఇది ఒకే క్లిక్‌తో పూర్తి ఇమెయిల్‌ను కంపోజ్ చేయడానికి యాక్సెస్ ఇస్తుంది. దీనివల్ల మీ సమయం చాలా వరకు ఆదా అవుతుంది.
9. ఆర్కైవ్..
ఇన్‌బాక్స్ ఫ్రీగా ఉండేందుకు ఇమెయిల్స్‌ను తొలగించడానికి బదులుగా.. వాటిని ఆర్కైవ్ చేయండి. ఇలా చేస్తే ఇమెయిల్స్ ఇన్‌బాక్స్ నుంచి ఆర్కైవ్ ఫోల్డర్‌లోకి వెళ్తుంది. మళ్లీ మీకు అవసరం అయినప్పుడు ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
10. కీబోర్డ్ షార్ట్‌కట్‌లు..
జీమెయిల్ వినియోగించేవారు కీబోర్ట్ షార్ట్‌కట్‌లు తెలుసుకుంటే మీ పని మరింత సులభతరం అవుతుంది. ఎక్కువ పని చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కీబోర్డ్‌లో ‘Shift + ?’ నొక్కాలి. అన్ని షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి.
Also Read:
LKG student Assaulted: చిన్నారిపై టీచర్ దాడి.. తల్లిదండ్రుల ఆందోళన.. మంత్రి జోక్యంతో
Hindu: బంగ్లాదేశ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మరో హిందువు
The Ashes: ఉగ్రదాడి.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సిడ్నీ టెస్టు