Hindu: బంగ్లాదేశ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మరో హిందువు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:43 PM
బంగ్లాదేశ్‌లో హిందువులను టార్గెట్ చేసుకొని వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు కొంతమంద మతోన్మాదులు. అల్లరి మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు మరో హిందువు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల పొరుగు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)లో హిందువు(Hindu)లపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో దాడుల్లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 31 న బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లా (Shariatpur District) 50 ఏళ్ల ఖోకస్ చంద్రదాస్ సామూహిక దాడి(Mass attack) జరిగింది. నిందితులు కత్తులతో ఎటాక్ చేసి.. నిప్పంటించారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతో ఈ రోజు (శనివారం) కన్నుమూశాడు. చంద్రదాసు షరియత్‌పూర్‌లో మందుల దుకాణం(Pharmacy) , మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. తీవ్రంగా కత్తిపోట్లు, కాలిన గాయాలతో బాధపడుతూ మూడు రోజుల చికిత్స తర్వాత దాస్ కన్నుమూశాడని ఢాకాలోని నేషనల్ బర్న్ ఇనిస్టిట్యూట్ డాక్టర్లు ధృవీకరించారు.
గత ఏడాది డిసెంబర్ 24 న అమృత్ మండల్ (29) అనే వ్యక్తిపై అల్లరి మూక దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. డిసెంబర్ 18న హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ ని ఓ గుంపు చిత్ర హింసలకు గురి చేసి చంపారు. మైమెన్‌సింగ్ జిల్లాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న హిందువుపై సహ ఉద్యోగి కాల్చి చంపాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు వరుసగా హిందువులను టార్గెట్ చేసుకొని చంపడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల