LKG student Assaulted: చిన్నారిపై టీచర్ దాడి.. తల్లిదండ్రుల ఆందోళన.. మంత్రి జోక్యంతో
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:54 PM
నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదడం కలకలం రేపుతోంది.
కోనసీమ జిల్లా, జనవరి 3: జిల్లాలోని రామచంద్రపురంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిని టీచర్ దారుణంగా కొట్టింది. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. చెల్లూరు గ్రామానికి చెందిన ఓ చిన్నారి రామచంద్రపురంలోని శ్రీ వివేకానంద స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది.
అయితే.. చిన్నారిని స్కూల్ టీచర్ స్కేల్‌తో పాటు, చేతులతో చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడటంతో తల్లిదండ్రులు ఆమెకు చికిత్స అందజేశారు. ఆపై పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. స్కూల్ యాజమాన్యం, సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.
ఈ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి వాసంశెట్టి పరిస్థితిని గమనించి కారులో నుంచి దిగారు. ఆందోళనకారులతో చర్చలు జరిపిన మంత్రి.. స్కూల్ యాజమాన్యం, టీచర్, తల్లిదండ్రులతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు. చిన్నారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఘటనపై అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో మంత్రులు, జడ్జిల భవనాలపై మంత్రి కీలక ప్రకటన
న్యూఇయర్ వేడుకల పేరుతో హంగామా.. శ్రీశైలం సిబ్బంది వీడియో వైరల్
Read Latest AP News And Telugu News