Share News

డబ్ల్యూటీసీ టేబుల్: అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ఏ స్థానంలో ఉందంటే?

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:15 PM

బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ అదరగొట్టింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ పర్సంటేజీని పెంచుకుంది.

డబ్ల్యూటీసీ టేబుల్: అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ఏ స్థానంలో ఉందంటే?
World Test Championship points table

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ అదరగొట్టింది. బంగ్లాపై రెండు రోజుల్లోనే ఇన్నింగ్స్, 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ పర్సంటేజీని పెంచుకుంది.


ఈ మ్యాచ్‌కు ముందు వరకూ ఆసీస్ ఖాతాలో 84 పాయింట్లు, 77.78 శాతం ఉండేది. బంగ్లాపై సంచలన విజయం తర్వాత 96 పాయింట్లకు చేరుకుంది. పర్సెంటేజీ కూడా 80 శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ దారుణమైన పరాభవం చవిచూడటంతో నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ 66.67 శాతం నుంచి 55.56 శాతానికి పడపోయింది. బంగ్లా ఖాతాలో 40 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.


భారత్‌కు ప్రయోజనం..

డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఓటమితో టీమిండియాకు కూడా కొంత ఊరట లభించింది. ప్రస్తుతం భారత్‌ 53.33 శాతం కాగా బంగ్లా కంటే పర్సెంటేజీ కాస్త తక్కువే. అయితే శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో గెలిస్తే బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే న్యూజిలాండ్(72.22 శాతం)కు చేరువగా రావచ్చు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా సాగుతున్న భారత జట్టుకు.. బంగ్లా పరాజయం కలిసొచ్చింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ విజయం సాధిస్తే.. ఈ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ.. ఎంత కొట్టాడంటే?

Updated Date - Aug 23 , 2026 | 04:15 PM