Share News

డబ్ల్యూపీఎల్2026లో ముంబైకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:41 PM

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిగింది. గాయం కారణంగా కీలక ప్లేయర్ జట్టుకు దూరమైంది. ఆ జట్టు వికెట్ కీపర్ జి.కమలినీ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో వైష్ణవి శర్మ టీమ్‌లోకి రానుంది.

డబ్ల్యూపీఎల్2026లో ముంబైకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం
G Kamalini

స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్-2026(WPL)లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ జి.కమలినీ డబ్ల్యూపీఎల్-2026 నుంచి వైదొలిగింది. గాయం కారణంగా ఆమె ఈ టోర్నమెంట్ తదుపరి మ్యాచులకు దూరం కానుంది. ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్ 2026లో కమలినీ ఆడిన ఐదు మ్యాచ్‌లలో 75 పరుగులు చేసి, ఏడు క్యాచ్‌లు అందుకుంది. కమలినీ గాయానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే.. ఆమె స్థానంలో ఎడమచేతి వాటమ్ స్పిన్నర్ వైష్ణవి శర్మను జట్టులోకి ముంబై ఇండియన్స్(Mumbai Indians) తీసుకుంది. వైష్ణవిని ముంబై రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.


2025లో ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టులో వైష్ణవి శర్మ(Vaishnavi Sharma) సభ్యురాలిగా ఉంది. ఆమె టీమిండియా తరఫున 5 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఐదు వికెట్లు పడగొట్టింది. గతేడాది డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో పాల్గొన్న జట్టులో కమలినీ, వైష్ణవి ఉన్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే జట్టుకు వీరిద్దరూ ఎంపికయ్యారు. భారత మహిళ జట్టు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 1 వరకు కొనసాగే ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.


ఇక.. డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై(Mumbai Indians) విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. అయితే.. నెట్ రన్‌రేట్ కారణంగా ఈ డిఫెండింగ్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌లకు ముందు ముంబై జట్టుకు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. ఇవాళ(మంగళవారం) కోటంబిలోని బీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 20 , 2026 | 05:05 PM