Share News

హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారీ విజయం.. చరిత్ర సృష్టించిన భారత్

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:40 PM

మహిళల హాకీ ప్రపంచ కప్‌ 2026లో భారత జట్టు అదరగొట్టింది. పూల్-డి రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 6-1తో ఘన విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారీ విజయం.. చరిత్ర సృష్టించిన భారత్
Women’s Hockey World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల హాకీ ప్రపంచ కప్‌ 2026లో భారత జట్టు అదరగొట్టింది. పూల్-డి రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 6-1తో ఘన విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. 11వ నిమిషంలో సునేలిటా టోప్పో గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. సర్కిల్‌లోకి వచ్చిన బంతిని అందుకున్న టోప్పో ఎలాంటి పొరపాటు చేయకుండా దానిని గోల్‌పోస్ట్‌లోకి పంపింది. భారత్ తొలి గోల్‌కు దక్షిణాఫ్రికా డిఫెన్స్ చేసిన తప్పిదమే కారణమైంది. సర్కిల్‌లో భారత ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంతో టోప్పో దాన్ని సద్వినియోగం చేసుకుంది.


రెండో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్

రెండో క్వార్టర్‌లోనూ భారత మహిళలు దూకుడు కొనసాగించారు. నవనీత్ కౌర్, సుశీలా చాను చెరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో క్వార్టర్‌లోనూ భారత్ మరింత దూకుడుగా ఆడింది. దీపిక, లాల్‌రెమ్సియామి, రాణా సాక్షి చెరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 6-0కు చేరింది. మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లడంతో దక్షిణాఫ్రికాకు తిరిగి పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. చివరి క్వార్టర్‌లో దక్షిణాఫ్రికా ఓ గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని కొంత తగ్గించింది. అయితే అప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు ఉండటంతో ఆ గోల్ ఎలాంటి ప్రభావం చూపలేదు. చివరికి భారత్ 6-1తో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పూల్-డి పోటీలో భారత జట్టు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో భారత ఫార్వర్డ్ లైన్, డిఫెన్స్ రెండూ సమష్టిగా రాణించడం విశేషం.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

Updated Date - Aug 18 , 2026 | 08:40 PM