17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:01 PM
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. అర్జున అవార్డుల జాబితాలో అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి గోపిచంద్ తదితరులు చోటు దక్కించుకున్నారు.
అర్జున అవార్డు గ్రహీతలు వీరే..
అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి.
బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్
బాక్సింగ్: నరేందర్ బెర్వాల్
చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్
పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్
హాకీ: లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్
కబడ్డీ: సుర్జీత్, పూజ
పారా-షూటింగ్: రుద్రాంశ్ ఖండేల్వాల్
పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్
రోయింగ్: అరవింద్ సింగ్
షూటింగ్: అఖిల్ షియోరాన్
లైఫ్‌టైమ్ అర్జున అవార్డు
1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడైన మాజీ ఆటగాడు ఐ. అరుమైనాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) దక్కింది.
ద్రోణాచార్య అవార్డులు
ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీలో పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్‌కుమార్ చవాన్ (షూటింగ్) ఎంపికయ్యారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్‌కు ప్రకటించారు.
ఆగస్టు 29 సంప్రదాయానికి బ్రేక్
సాధారణంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఆగస్టు 29న జరుగుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే కరోనా తర్వాత ఈ సంప్రదాయంలో మార్పులు వచ్చాయి. క్రీడా క్యాలెండర్‌కు అనుగుణంగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2025లోనూ పురస్కారాల ప్రదానోత్సవం జనవరి 17న జరిగింది.
ఇవి కూడా చదవండి:
డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్ చేసుకున్న రాహుల్!
బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్