క్రికెట్‌లో ప్రమాదం.. ఐసీయూలో చేరిన అంపైర్
ABN , Publish Date - Aug 18 , 2026 | 02:03 PM
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్‌ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్‌గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్‌ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్‌కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు.
ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్‌ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్‌లు వాడాలని, టీ20 ఫార్మాట్‌లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్ చేసుకున్న రాహుల్!
బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్