బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:42 AM
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇది ఇలా ఉంటే.. మూడో రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాల మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు శ్రీలంక జట్టు 284 పరుగులకే ఆలౌటైంది. ఇది ఇలా ఉంటే.. మూడో రోజు ఆటలో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహమ్మద్ సిరాజ్, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాల మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే...
జడేజా బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ బంతిని లెగ్ సైడ్ కట్ చేశాడు. ఇదే సమయంలో డీప్ ఫీల్డ్‍లో ఉన్న మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ బుల్లెట్ వేగంతో విసిరిన బంతి.. లెగ్ అంపైర్ అహ్సన్ రజాకు తృటిలో తప్పింది. సిరాజ్ బలంగా విసిరిన త్రో రజాకు తగిలే అంత దగ్గరగా వచ్చింది. కానీ అంపైర్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.
దీంతో జడేజా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. వారిద్దరీ సంభాషణ చూసిన నెటిజన్లు సరద కామెంట్స్ చేశారు. సిరాజ్ బలంగా బంతిని త్రో చేసి అంపైర్‌ను భయపెట్టాడని కొందరు కామెంట్స్ చేశారు. అలానే జడేజా, సిరాజ్ కలిసి అంపైర్‌ను టార్గెట్ చేశారంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
గాలే టెస్టులో భారత్ ఓడిపోవచ్చు.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
సంజయ్ మంజ్రేకర్, కార్తీక్ వాగ్వాదం!