Share News

డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్‌ చేసుకున్న రాహుల్!

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:58 PM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ఔటైనట్లుగా భావించి మైదానం నుంచి వెళ్తున్న కేఎల్ రాహుల్‌కు దేవదత్ పడిక్కల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాతి పరిణామలతో పడిక్కల్‌ను రాహుల్ గట్టిగా హగ్ చేసుకున్నాడు.

డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్‌ చేసుకున్న రాహుల్!
KL Rahul DRS

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. లంక బ్యాటర్ల తరహాలోనే టీమిండియా బ్యాటర్లు పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇవాళ ఆటలో భారత్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఊహించని లైఫ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన రాహుల్.. దేవదత్ పడిక్కల్ ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


టీమిండియా రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య వేసిన అద్భుతమైన బంతి రాహుల్ కాలికి తగిలింది. దీంతో లంక ప్లేయర్లు అప్పిల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రాహుల్‌ను ఔటైనట్లు ప్రకటించాడు. అయితే, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ వెంటనే జోక్యం చేసుకున్నాడు. డీఆర్‌ఎస్ (DRS) తీసుకోవాలని రాహుల్‌ను ఒప్పించాడు. దీంతో రాహుల్ అయిష్టంగానే రివ్యూ కోరాడు. రీప్లేలో బాల్ ట్రాకింగ్ పరిశీలించగా.. బంతి లెగ్ స్టంప్ పైనుంచి వెళ్తున్నట్లు తేలడంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. లైఫ్ దక్కడంతో ఊపిరి పీల్చుకున్న రాహుల్, తనను కాపాడిన పడిక్కల్‌ను గట్టిగా హగ్‌ చేసుకున్నాడు. ఈ దృశ్యం మ్యాచ్‌లోనే హైలెట్‌గా నిలిచింది.


అయితే, తనకు వచ్చిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రివ్యూ తర్వాత కొద్దిసేపు దూకుడుగా ఆడిన రాహుల్ (47 బంతుల్లో 35 పరుగులు) మళ్లీ జయసూర్య బౌలింగ్‌లోనే మిడాఫ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్టన్ రత్నాయకేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


ఇవి కూడా చదవండి:

బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

గాలే టెస్టులో భారత్ ఓడిపోవచ్చు..!

Updated Date - Aug 18 , 2026 | 02:33 PM