ఐదో స్థానం సాధిస్తారా?
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:19 AM
సెమీఫైనల్‌కు ఎలాగూ చేరలేకపోయింది. ఇప్పుడిక భారత మహిళల జట్టు ప్రపంచ కప్ హాకీలో చారిత్రక ఐదో స్థానంపై గురిపెట్టింది. ఈ క్రమంలో గురువారం జరిగే మ్యాచ్‌లో పటిష్టమైన జర్మనీని ఢీకొననుంది.
జర్మనీతో భారత మహిళల పోరు నేడు
హాకీ ప్రపంచ కప్
ఆమ్‌స్టెల్వీన్: సెమీఫైనల్‌కు ఎలాగూ చేరలేకపోయింది. ఇప్పుడిక భారత మహిళల జట్టు ప్రపంచ కప్ హాకీలో చారిత్రక ఐదో స్థానంపై గురిపెట్టింది. ఈ క్రమంలో గురువారం జరిగే మ్యాచ్‌లో పటిష్టమైన జర్మనీని ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. ఇక..వరల్డ్ కప్‌నకు సంబంధించి..1974 ఆరంభ టోర్నమెంట్‌లో నాలుగో స్థానంలో నిలవడమే ఇప్పటివరకు మన మహిళల అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి మెగా టోర్నీలో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసిన దరిమిలా భారత జట్టు సెమీఫైనల్ దారులు మూసుకు పోయాయి. ఆ మ్యాచ్ తర్వాత లభించిన మూడు రోజుల విశ్రాంతితో మన మహిళలు జర్మనీతో పోరుకు సిద్ధమయ్యారు. అయితే ప్రపంచ ర్యాంకింగ్‌లలో తొమ్మిదో స్థానంలో ఉన్న టీమిండియా ఐదో స్థానంలో ఉన్న జర్మనీని ఎదుర్కోవడం అంత సులువేం కాదు. ఇక నేడు జరిగే తొలి సెమీఫైనల్లో నెదర్లాండ్స్-బెల్జియం తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సెరెనా-అల్కరాజ్ జోడీ ఓటమి