Share News

టెస్టుల్లో జడేజా షాకింగ్ రికార్డు.. ఏకంగా 88 నో బాల్స్!

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:39 PM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు క్రికెట్‌లో నో బాల్స్ సమస్యగా మారుతోంది. 2021 నుంచి టెస్టుల్లో జడేజా వేసిన నో బాల్స్ సంఖ్య 88కి చేరింది. టెస్టు క్రికెట్‌లో ఒక స్పిన్నర్ అత్యధిక నో బాల్స్ వేసిన చెత్త రికార్డును జడేజా మూటగట్టుకున్నాడు.

టెస్టుల్లో జడేజా షాకింగ్ రికార్డు.. ఏకంగా 88 నో బాల్స్!
Ravindra Jadeja

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు క్రికెట్‌లో నో బాల్స్ సమస్యగా మారుతోంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఈ సమస్య కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో మరో నోబాల్‌ వేయడంతో.. 2021 నుంచి టెస్టుల్లో జడేజా వేసిన నో బాల్స్ సంఖ్య 88కి చేరింది. టెస్టు క్రికెట్‌లో ఒక స్పిన్నర్ అత్యధిక నో బాల్స్ వేసిన చెత్త రికార్డును జడేజా మూటగట్టుకున్నాడు. జడేజా తర్వాత రెండో స్థానంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ ఉన్నాడు.


టెస్టుల్లో స్పిన్నర్ల నో బాల్స్ రికార్డు

  • 88 – రవీంద్ర జడేజా

  • 40 – నోమన్ అలీ

  • 33 – లసిత్ ఎంబుల్డెనియా

  • 19 – జాక్ లీచ్

  • 17 – జోమెల్ వారికన్

  • 17 – జహిర్ ఖాన్


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ విధించిన ఫాలో ఆన్‌లో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో గట్టిగా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. పసిందు సూర్యబండారా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 92 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఔటయ్యాడు. కమిందు మెండిస్ 55 పరుగులతో రాణించాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించారు. అప్పటికి శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సోనల్ దినుశా (7*), కేషరా నువాంత (3*) పరుగులతో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట

పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!

Updated Date - Aug 26 , 2026 | 06:39 PM