Share News

అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..

ABN , Publish Date - Aug 25 , 2026 | 07:29 AM

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట చివర్లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. కోపంతో లంక బ్యాటర్ గ్లౌజులను విసిరేశాడు.

అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..
India vs Sri Lanka 2nd Test

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వివాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికే టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, లంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి ఆటగాళ్ల తీరును పలువురు మాజీ క్రికెటర్లు సైతం వ్యతిరేకించారు. తాజాగా అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. శ్రీలంక బ్యాటర్ తన గ్లౌజులను విసిరేశాడు. ఈ ఘటన రెండో రోజు ఆట ముగిసిన తర్వాత పెవిలియన్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...


భారత్ తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు.


ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. ఈ దృశ్యం మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కామెంట్రీ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ కూడా జయసూర్య తీవ్ర అసహనంలో ఉన్నాడని వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్

భారత్‌తో టీ20 సిరీస్‌: అఫ్గానిస్థాన్ కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్‌.. నవీన్‌ ఉల్‌ హక్‌ రీఎంట్రీ

Updated Date - Aug 25 , 2026 | 07:45 AM