భారత్‌తో టీ20 సిరీస్: అఫ్గానిస్థాన్ కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్.. నవీన్ ఉల్ హక్ రీఎంట్రీ
ABN , Publish Date - Aug 24 , 2026 | 07:58 PM
భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా ఇబ్రహీంకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా ఇబ్రహీంకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే వేదిక కానుంది. ఈ సిరీస్‌ను అఫ్గానిస్థాన్ హోమ్ సిరీస్‌గా పరిగణిస్తున్నారు.
నవీన్ ఉల్ హక్ రీఎంట్రీ..
గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన పేసర్ నవీన్ ఉల్ హక్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. నవీన్ రాకతో అఫ్గానిస్థాన్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఫజల్ హక్ ఫరూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా పేస్ దళంలో ఉన్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. స్పిన్ విభాగానికి స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. నూర్ అహ్మద్, నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో కలిసి అఫ్గాన్ స్పిన్ దళం భారత్ బ్యాటర్లకు సవాల్ విసరనుంది. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కూడా జట్టులో ఉండటం అదనపు బలం.
అఫ్గానిస్థాన్ జట్టు ఇదే:
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహ్మాన్ (వికెట్ కీపర్), సదీఖుల్లా అటల్, దర్వీష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫరూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీన్ ఉల్ హక్.
రిజర్వులు: ఇజాజ్ అహ్మద్‌జాయ్, షాహిదుల్లా కమాల్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు