Share News

శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:08 PM

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. 503/9 స్కోర్ వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది.

శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
India vs Sri Lanka 2nd Test

ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. 503/9 స్కోర్ వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. డిక్లేర్ ఇచ్చిన సమయానికి క్రీజులో ధ్రువ్ జురెల్(115*), ప్రసిద్ధ్ కృష్ణ(4*) ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. తొలి టెస్టులో శతక్కొట్టిన దేవదత్ పడిక్కల్(117) రెండో టెస్టులోనూ సెంచరీ బాదాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్(115*) శతకం బాదడం విశేషం. అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా ధ్రువ్ రికార్డు నెలకొల్పాడు.


కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50), వికెట్ కీపర్ రిషభ్ పంత్(63) హాఫ్ సెంచరీలతో రాణించారు. పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. కోలుకుని తిరిగి మైదానంలోకి దిగిన పంత్.. హాఫ్ సెంచరీ చేయడం విశేషం. యశస్వి జైస్వాల్(45), రవీంద్ర జడేజా(43) పర్వాలేదనపించారు. కేఎల్ రాహుల్(18), సారాంశ్ జైన్(6), మానవ్ సుతార్(18), సిరాజ్(3) పరుగులు చేశారు. కాగా శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2, కేషార నువాంత 2, లాహిరు కుమార ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

పడిక్కల్‌ను పక్కన పెట్టలేరు.. ఇక్కడ కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు: క్రిస్ శ్రీకాంత్

బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు

Updated Date - Aug 24 , 2026 | 05:09 PM