భారత్-శ్రీలంక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:47 PM
కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఓపెనర్ లాహిరు కుమార(1), ప్రభాత్ జయసూరియా(2) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ తలొక వికెట్ తీశారు. అయితే భారత్ కంటే శ్రీలంక ఇంకా 495 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115*) సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50), రిషభ్ పంత్(63) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. యశస్వి జైస్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు. లంక బౌలర్లకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు