పంత్‌ను తిరిగి వన్డే జట్టులోకి తీసుకోవాలి: వసీం జాఫర్
ABN , Publish Date - Nov 25 , 2026 | 07:12 PM
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న పంత్‌కు వన్డేల్లోనూ అవకాశం కల్పించాలని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వన్డే జట్టులోకి తిరిగి రావాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న పంత్‌కు వన్డేల్లోనూ అవకాశం కల్పించాలని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ లాంటి ఆటగాడు జట్టులో ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. కెప్టెన్సీ భారం లేకుండా ఆడితే ఐపీఎల్‌లోనూ పంత్ ఆటతీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని జోస్యం చెప్పాడు.
‘వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ లాంటి ఆటగాడు కచ్చితంగా ఉండాలి. అతడి గురించి చర్చ జరగాలి. వన్డేల్లో కూడా అతను తిరిగి రావచ్చని నేను భావిస్తున్నా. ఐపీఎల్‌లోనూ ఈ సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఆడితే పంత్‌లో వచ్చిన మార్పును మీరు కూడా చూస్తారు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టులో కెప్టెన్సీ అతడికి భారంగా మారిందని నేను భావిస్తున్నా. ఐపీఎల్‌లో రూ.27 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాడు. పంత్ ఒక బాక్సాఫీస్ ఆటగాడు. అయితే అంత భారీ ధర పలికినప్పుడు అదనపు ఒత్తిడి సహజంగానే ఉంటుంది. ఆటగాడిగా రాణించడంతో పాటు జట్టు కూడా విజయాలు సాధించాలనే అంచనాలు ఉంటాయి. దురదృష్టవశాత్తూ గత రెండు సీజన్లలోనూ అది జరగలేదు. దీంతో టీ20 బ్యాటర్‌గా అతడి విలువ తగ్గినట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌పై సెంచరీతో ఆకట్టుకున్న పంత్.. వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వసీం జాఫర్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్