Share News

నాపై కమిన్స్ మాటల దాడికి దిగుతాడని ఊహించలేదు: ఉస్మాన్ ఖవాజా

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:03 PM

శాండ్‌పేపర్ వివాదంపై కొద్దిరోజులుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు విషయాలను వెల్లడించాడు. తాజాగా కమిన్స్ వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు.

నాపై కమిన్స్ మాటల దాడికి దిగుతాడని ఊహించలేదు: ఉస్మాన్ ఖవాజా
Usman Khawaja

ఇంటర్నెట్ డెస్క్: శాండ్‌పేపర్ వివాదంపై కొద్దిరోజులుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు విషయాలను వెల్లడించాడు. ఖవాజా చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపడేశాడు. ఆసీస్ మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా.. శాండ్‌పేపర్ వివాదం గురించి జట్టులోని సభ్యులందరికీ తెలుసని, కానీ కేవలం ముగ్గురు ప్లేయర్లనే బలి పశువులను చేశారంటూ ఆయన ఆత్మకథలో ప్రస్తావించడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా కమిన్స్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌పై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. కమిన్స్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని వెల్లడించాడు.


‘ప్యాట్ కమిన్స్‌ను వ్యక్తిగతంగా, నాయకుడిగా నేను ఎప్పుడూ ఎంతో ఇష్టపడతా. అతను అద్భుతమైన వ్యక్తి. కానీ అతను ఇలా బహిరంగంగా నాపై వ్యక్తిగత దాడికి దిగుతాడని అస్సలు అనుకోలేదు. నన్నే లక్ష్యంగా చేసుకుని చాలా సేపు విమర్శిస్తూనే ఉన్నాడు. కమిన్స్‌లో ఇలాంటి కోణాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. అదే నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ ప్రెస్‌మీట్‌ చూడాలని నాకు లేదు. కానీ అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాల్సి రావడంతో చూశాను. నా భార్య రేచల్‌ పక్కనే కూర్చుని 'నువ్వు బాగానే ఉన్నావా?' అని పదేపదే అడిగింది. కానీ ఆ సమయంలో నా మనసులో ఎన్నో భావోద్వేగాలు ఉండటంతో ఆమెకు సమాధానం కూడా చెప్పలేకపోయాను.


నా సమస్య ప్యాటీతో కాదు. క్రికెట్‌ ఆస్ట్రేలియాలోని బాధ్యులు ముందుకొచ్చి ఈ విషయం గురించి మాట్లాడితే బాగుండేది. ఈ విషయంలో సీఏ నాయకత్వం వహించాల్సింది. ఇది ప్యాట్‌ కమిన్స్‌ సమస్య కాదు. క్రికెట్‌ ఆస్ట్రేలియాలో ఎలాగైనా విజయం సాధించాలనే దృక్పథం కోచ్‌ల నుంచి ఆటగాళ్ల వరకు విస్తరించింది. నాకు ప్యాటీపై ఎలాంటి కోపం లేదు. కానీ అతని ప్రెస్‌మీట్‌ నన్ను నిజంగానే బాధించింది. అయినప్పటికీ కేవలం 20 నిమిషాల ప్రెస్‌మీట్‌ను బట్టి అతడిపై అభిప్రాయం ఏర్పరుచుకోను. అతనిపై నాకు ఎప్పటికీ అభిమానం ఉంటుంది. నేను ద్వేషించే మనిషిని కాదు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా’ అని ఖవాజా వివరించాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. రెండో స్థానానికి జస్‌ప్రీత్ బుమ్రా

మీరట్‌లో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిని ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు!

Updated Date - Nov 25 , 2026 | 04:03 PM