Share News

మీరట్‌లో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిని ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 02:45 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హోటల్ గదిలోనే సోమవారం రాత్రంతా నిర్భంధించిన తన మాజీ ప్రియుడి చెర నుంచి ఓ యువతి తప్పించుకుంది. హోటల్ నుంచి ‘హెల్ప్.. హెల్ప్’ అంటూ బయటకు పరుగులు తీసింది.

మీరట్‌లో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిని ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు!
Meerut incident

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని ఆమె మాజీ ప్రియుడు హోటల్ గదిలో రాత్రంతా నిర్బంధించాడు. సోమవారం రాత్రి నుంచి అతడి చెరలో ఉన్న యువతి.. మరుసటిరోజు ఎలాగోలా తప్పించుకుని హోటల్ నుంచి బయటకు పరుగులు తీసింది. ‘హెల్ప్.. హెల్ప్’ అంటూ కేకలు వేస్తూ సాయం కోసం వేడుకుంది. అయితే ఆమెను వెంబడించిన మాజీ ప్రియుడు పట్టుకుని తిరిగి హోటల్‌లోకి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఘజియాబాద్‌లోని సదర్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


సదరు యువతి కేకలు విన్న స్థానికులు ఆమెను కాపాడేందుకు హోటల్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. సిబ్బంది అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈలోగా అక్కడ జనం భారీగా గుమిగూడటంతో యువతిని బంధించిన వ్యక్తి హోటల్ పైకప్పు ఎక్కి పరారయ్యాడు. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే ఆ వ్యక్తికి రూమ్ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు హోటల్‌ను సీజ్ చేశారు.


కాగా బాధితురాలు ఘజియాబాద్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. తనను హోటల్‌లో బంధించిన వ్యక్తి పేరు సల్మాన్ అని, అతడు మీరట్‌లోని కంకర్‌ఖేడా ప్రాంతానికి చెందినవాడని ఆమె తెలిపింది. సోమవారం నుంచి తనను హోటల్‌లోనే ఉంచాడని, తప్పించుకోవడానికి అవకాశం దొరకడంతో బయటకు పరుగులు తీసినట్లు ఫిర్యాదులో వెల్లడించింది. అయితే సల్మాన్‌తో తనకు రెండున్నరేళ్లుగా పరిచయం ఉందని, అతడు తనను కిడ్నాప్ చేయలేదని మహిళ పోలీసులకు చెప్పినట్లు సదర్ కాంట్ సర్కిల్ అధికారి సంజయ్ గుప్తా వెల్లడించారు. ఇద్దరూ హోటల్‌లో కలిసి ఉండగా.. వారి మధ్య తలెత్తిన ఓ వివాదం చివరకు ఘర్షణకు దారితీసినట్లు తెలిపారు. మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 02:59 PM