Share News

68 బంతుల్లో 181

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:48 AM

ఢిల్లీ కెప్టెన్‌ ప్రియాన్ష్‌ ఆర్య (68 బంతుల్లో 7 ఫోర్లు, 19 సిక్సర్లతో 181) సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు...

68 బంతుల్లో 181

ప్రియాన్ష్‌ విజృంభణ

భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక స్కోరుతో రికార్డు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ

ఇండోర్‌: ఢిల్లీ కెప్టెన్‌ ప్రియాన్ష్‌ ఆర్య (68 బంతుల్లో 7 ఫోర్లు, 19 సిక్సర్లతో 181) సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతడు.. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఈక్రమంలో కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌)ను అధిగమించాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ప్రిటోరియస్‌ (188 నాటౌట్‌) తర్వాత రెండో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా ప్రియాన్ష్‌ నిలిచాడు. ఇక ఆర్య జోరుతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మంగళవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 116 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 275/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాన్ష్‌ 36 బంతుల్లోనే శతకం పూర్తి చేయగా.. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో ఎక్కువ (19) సిక్సర్లు బాది ఫిన్‌ ఆలెన్‌తో సమంగా నిలిచాడు. అనంతరం ఛేదనలో తమిళనాడు 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. షారుక్‌ ఖాన్‌ (30) టాప్‌ స్కోరర్‌.

ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 03:49 AM