ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ ఆదాయం ఎంతో తెలుసా?
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:33 PM
ఐపీఎల్ 2026లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. అరుదైన రికార్డులు కొల్లగొట్టి పలు అవార్డులు అందుకున్నాడు. మరి ఈ కుర్రాడు ఐపీఎల్ 2026లో ఎంత డబ్బును సంపాదించాడో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. అరుదైన రికార్డులు కొల్లగొట్టి పలు అవార్డులు అందుకున్నాడు. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. 59 సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఏకంగా ఒకే సీజన్‌లో 72 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరి ఈ కుర్రాడు ఐపీఎల్ 2026లో ఎంత డబ్బును సంపాదించాడో తెలుసా..?
వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.1.10కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లోనూ అదే మొత్తానికి రిటైన్ చేసుకుంది. ఈ డబ్బుతో పాటు వైభవ్ మ్యాచ్ ఫీజులు, పలు రివార్డులూ అందుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా రూ.15 లక్షలు, టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నందుకు రూ.10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10లక్షలతో పాటు టాటా సియెరా కారు, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు సొంతం చేసుకున్నందుకు రూ.10 లక్షలు అందుకున్నాడు.
కేవలం ఈ అవార్డుల ద్వారానే వైభవ్ రూ.55లక్షల నగదు బహుమతిగా అందుకున్నాడు. ఇక బీసీసీఐ అమలు చేసే మ్యాచ్ ఫీజు విధానం ప్రకారం, ప్రతి మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున ఆటగాళ్లకు చెల్లిస్తారు. వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడటంతో మ్యాచ్ ఫీజుల రూపంలోనే రూ.1.20 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు పలుమార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్', 'మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్' వంటి అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఒక్కో అవార్డుకు రూ.1 లక్ష చొప్పున నగదు బహుమతి లభించింది. అన్నీ కలిపి చూస్తే, రిటైనర్ ఫీజు రూ.1.10 కోట్లు, మ్యాచ్ ఫీజులు రూ.1.20 కోట్లు, సీజన్ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు, ఇతర మ్యాచ్ అవార్డుల నగదు బహుమతులతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో రూ.2.85 కోట్లకు పైగా ఆదాయం పొందినట్లు తెలుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్.. ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత విలువైన యువ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
ఇవి కూడా చదవండి:
విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్
ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం