Share News

పారా ఏషియన్ స్వర్ణపతక విజేత నీరజ్ మృతి

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:39 PM

క్రీడా లోకానికి దిగ్భ్రాంతికర వార్త ఇది. పారా ఏషియన్ క్రీడల్లో మూడు సార్లు స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్ (42) ఇక లేరు. ఢిల్లీలోని ఒక ఫ్లాట్‌లో మంగళవారం ఆయన విగతజీవిగా కనిపించారు. విషం తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పారా ఏషియన్ స్వర్ణపతక విజేత నీరజ్ మృతి

ఇంటర్నెట్ డెస్క్: క్రీడా లోకానికి దిగ్భ్రాంతికర వార్త ఇది. పారా ఏషియన్ క్రీడల్లో మూడు సార్లు స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్ (42) ఇక లేరు. ఢిల్లీలోని ఒక ఫ్లాట్‌లో మంగళవారం ఆయన విగతజీవిగా కనిపించారు. విషం తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నీరజ్ మరణ వార్తను ఇండియన్ పారా అథ్లెటిక్స్ కోచ్ ఎస్.సత్యనారాయణ ధ్రువీకరించారు. బుధవారం ఓ వార్తా సంస్థతో సత్యనారాయణ మాట్లాడారు. నీరజ్ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని, క్రీడాకారులెవరూ ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడవద్దని ఆయన కోరారు. నీరజ్ ఏషియన్ గేమ్స్ చాంపియన్‌ మాత్రమే కాకుండా మంచి అథ్లెట్‌ అని ఆయన కొనియాడారు. నీరజ్ మరణం క్రీడా లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కాగా.. నీరజ్ మృతదేహానికి బుధవారం ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆయన మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


ఏడేళ్లలోనే పోలియో బారిన పడినా..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 42 ఏళ్ల నీరజ్ యాదవ్ తన ఏడేళ్ల వయసులోనే పోలియో బారిన పడ్డారు. అయినా కూడా ఎంతో కృషితో క్రీడల్లో రాణించారు. అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో విభాగాల్లో పోటీపడ్డారు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో, 2022లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్‌ త్రోలో బంగారు పతకాలు సాధించారు. హాంగ్‌జౌలో డిస్కస్‌ త్రోలో స్వర్ణ పతకం గెలిచారు. అంతకుముందు వీల్‌చైర్‌ టెన్నిస్‌లో 2005 నుంచి 2012 వరకు పాల్గొన్న నీరజ్.. తర్వాత పారా అథ్లెటిక్స్‌లోకి వచ్చారు. పారా అథ్లెటిక్స్‌లోని ఎఫ్‌55 విభాగంలో (క్రీడాకారులు కూర్చున్న స్థితిలోనే ఆడడం) జావెలిన్‌, డిస్కస్‌, షాట్‌పుట్‌ వంటి పోటీల్లో పాల్గొన్నారు. ఇటీవల ఐచీ నగోయాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో నీరజ్‌ పాల్గొనలేకపోయారు. డోపింగ్‌ నిషేధం వల్ల ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.


నిషేధం వల్ల ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. 2023 అక్టోబర్‌లో బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కేంద్రంలో నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో నీరజ్‌ శాంపిల్‌లో స్టానోజోలోల్‌ అనే నిషేధిత అనాబాలిక్‌ స్టెరాయిడ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో అదే ఏడాది నవంబర్‌లో ఆయనపై డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఆయనపై 2024లో తాత్కాలిక నిషేధం విధించారు. ఈ కేసు భారత పతకాల పట్టికపైనా ప్రభావం చూపింది. హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ సాధించిన రెండు బంగారు పతకాలను రద్దు చేయడంతో దేశం మొత్తం పతకాల సంఖ్య 111 నుంచి 108కి తగ్గింది. బంగారు పతకాల సంఖ్య కూడా 29 నుంచి 27కి పడిపోయింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది.


ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 01:22 PM