మన్‌దీప్ హ్యాట్రిక్
ABN , Publish Date - Oct 28 , 2026 | 01:44 AM
మన్‌దీ్‌ప సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)ని భారత హాకీ జట్టు ఘన విజయంతో ఆరంభించింది.
13-0తో బంగ్లాపై భారత్ ఘన విజయం
హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
జలంధర్: మన్‌దీ్‌ప సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)ని భారత హాకీ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 13-0తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మన్‌దీప్ (3వ, 10వ, 45వ నిమిషం) మూడు ఫీల్డ్ గోల్స్‌తో అదరగొట్టగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (2వ, 44వ), దిల్‌ప్రీత్ సింగ్ (43వ, 44వ), వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ (60వ, 60వ) రెండేసి గోల్స్ సాధించారు.
శిలానంద్ లక్రా (15వ), అభిషేక్ (18వ), నీలకంఠ (26వ), జుగ్‌రాజ్ (46వ) తలో గోల్ చేశారు. తొలి క్వార్టర్‌లో నాలుగు గోల్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన భారత్.. రెండో క్వార్టర్‌లో రెండు, మూడో క్వార్టర్‌లో మూడు గోల్స్ చేసింది. ఆఖరి క్వార్టర్‌లో మరో నాలుగు గోల్స్ సాధించింది. ఇతర మ్యాచ్‌లలో మలేసియా 5-4తో చైనాపై, జపాన్ 3-2తో కొరియాపై గెలిచాయి.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..