Share News

బాలెన్‌ డి ఓర్‌ విజేతలు హ్యారీ కేన్‌, అలెక్సియా

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:58 AM

ఇంగ్లండ్‌ సాకర్‌ సూపర్‌ స్టార్‌ హ్యారీ కేన్‌ను ఫిఫా ప్రతిష్ఠాత్మక ‘బాలెన్‌ డి ఓర్‌’ అవార్డు వరించింది.

బాలెన్‌ డి ఓర్‌ విజేతలు హ్యారీ కేన్‌, అలెక్సియా
Harry Kane, Alexia Putellas

లండన్‌: ఇంగ్లండ్‌ సాకర్‌ సూపర్‌ స్టార్‌ హ్యారీ కేన్‌ను ఫిఫా ప్రతిష్ఠాత్మక ‘బాలెన్‌ డి ఓర్‌’ అవార్డు వరించింది. 2025-26 సీజన్‌లో అత్యుత్తమ ఆట తీరును కనబరిచినందుకు గాను కేన్‌కు ఈ అవార్డు దక్కింది. మెస్సీ, యామల్‌, ఎంబప్పేలను వెనక్కు నెట్టి కేన్‌ ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం. ఇక, 25 ఏళ్ల తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన ఇంగ్లిషు ఫుట్‌బాలర్‌గా 33 ఏళ్ల కేన్‌ నిలిచాడు. మహిళల విభాగంలో బాలెన్‌ డి ఓర్‌ పురస్కారం స్పెయిన్‌ మిడ్‌ఫీల్డర్‌ అలెక్సియా పుటెలా్‌సకు దక్కింది.


ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 28 , 2026 | 01:58 AM