మోలియా ‘ట్రిపుల్’
ABN , Publish Date - Oct 28 , 2026 | 02:07 AM
బరోడాకు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు మోలియా (321) జమ్మూ కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌లో త్రిశతకంతో కదం తొక్కాడు.
జమ్మూతో బరోడా రంజీ
వడోదరా: బరోడాకు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు మోలియా (321) జమ్మూ కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌లో త్రిశతకంతో కదం తొక్కాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతి పిన్న వయస్సులో ట్రిపుల్ సెంచరీ బాదిన ఏడో భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గ్రూప్ ‘ఎ’లో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 6/0తో నిలిచింది.
బదోనీ డబుల్ సెంచరీ: సారథి ఆయుష్ బదోనీ (210) మరో డబుల్ సెంచరీతో దుమ్ము రేపడంతో జార్ఖండ్‌తో గ్రూప్ ‘సి’ రంజీ పోరులో ఢిల్లీ ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 515/5 స్కోరుతో డిక్లేర్ చేసింది. అనంతరం జార్ఖండ్ రెండో రోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 131/4 స్కోరుతో నిలిచింది. బదోనీకి ఇది వరుసగా రెండో ద్విశతకం. గత నెలలో గుజరాత్‌పైనా బదోని (217) డబుల్ సెంచరీ సాధించాడు.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..