Share News

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:31 PM

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడుకు చెందిన జి. కమలినికి ఆ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా
C Joseph Vijay

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడుకు చెందిన జి. కమలినికి ఆ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పసిడి సాధించిన టీమిండియా జట్టులో కమలిని సభ్యురాలిగా ఉంది. ఆమెకు రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు.


మదురైకి చెందిన కమలిని భారత జట్టులో సభ్యురాలిగా ఉండటంపై తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో శ్రీలంకపై చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం అందుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఈ జట్టులో సభ్యురాలిగా ఉన్న ప్లేయర్ కమలినికి ప్రత్యేక అభినందనలు. ఆమె ప్రతిభను గుర్తిస్తూ ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించాలని నిర్ణయించాం. కమలిని వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుంది. ఆమె విజయం రాష్ట్రంలోని యువత, మహిళలకు కొత్త స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది’ అని సీఎం విజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు

Updated Date - Sep 22 , 2026 | 08:34 PM