Share News

టీ20 ప్రపంచ కప్: సికందర్ రజా హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 154

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:00 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జింబాబ్వే-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచ కప్: సికందర్ రజా హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 154
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జింబాబ్వే-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 154 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ సికందర్ రజా(73; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.


ఇండియాపై సెంచరీ చేసిన బెన్నెట్(15) విఫలమయ్యాడు. మదండే(26) పర్వాలేదనిపించాడు. మారుమణి(7), మైయర్స్(11), బర్ల్(5), మున్యోంగ(2), ఎవాన్స్(8) నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా 2, బోష్ 2, లిండే, లుంగి ఎంగిడి, అన్రిచ్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

Updated Date - Mar 01 , 2026 | 05:00 PM