Share News

టీ20 ప్రపంచ కప్ 2026.. జట్టును ప్రకటించిన స్కాట్లాండ్

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:18 AM

స్కాట్లాండ్.. అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుక రిచీ బెరింగ్టన్ నాయకత్వం వహించనున్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026.. జట్టును ప్రకటించిన స్కాట్లాండ్
Scotland

ఇంటర్నెట్ డెస్క్: స్కాట్లాండ్.. అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026) కోసం తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు రిచీ బెరింగ్టన్ నాయకత్వం వహించనున్నాడు. 2024 ఎడిషన్‌లో ఆడిన వారిలో 11 మంది ఈసారి కూడా అవకాశం దక్కించుకున్నారు. ఎవరైనా ఆటగాడు గాయపడితే వెంటనే జట్టులో చేరేందుకు వీలుగా ఇద్దరిని ట్రావెలింగ్ రిజర్వ్‌లు, ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు. గ్రూప్ సిలో ఉన్న స్కాట్లాండ్.. కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌ను ఢీ కొట్టనుంది.


భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడమని తేల్చి చెప్పడంతో ఐసీసీ(ICC) ప్రత్యామ్నాయ జట్టుగా స్కాట్లాండ్‌(Scotland)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆరు సార్లు వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడింది. అత్యుత్తమంగా 2021లో సూపర్ 12 దశకు చేరింది. తమకంటే మెరుగైన జట్లను ఓడించిన చరిత్ర స్కాట్లాండ్‌కు ఉంది. 2021 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌, 2022 ఎడిషన్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. 2024లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్‌ని ఛేదించడానికి ఆసీస్ తీవ్రంగా చెమటోడ్చింది. 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మరి ఈసారి అనూహ్యంగా చోటు దక్కించుకున్న స్కాట్లాండ్ జట్టు ఎవరికి షాకిస్తుందో చూడాలి.


టీ20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ జట్టు:

రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్.

నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.


ఇవి కూడా చదవండి:

ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

Updated Date - Jan 27 , 2026 | 11:18 AM