Share News

ఆ జోరు కనిపించడం లేదు.. బుమ్రా బౌలింగ్‌పై గావస్కర్ అసంతృప్తి

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:50 PM

టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బుమ్రా బౌలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి కొత్త బంతితో ప్రమాదకరంగా కనిపించిన బుమ్రా.. రెండో కొత్త బంతి అందుకున్న తర్వాత మాత్రం అదే జోరు చూపించలేకపోయాడని విశ్లేషించాడు.

ఆ జోరు కనిపించడం లేదు.. బుమ్రా బౌలింగ్‌పై గావస్కర్ అసంతృప్తి
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై చర్చ నడుస్తోంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఏకంగా 26 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు మెయిడిన్ ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతులు ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లకపోవడంతో వికెట్లు చేజారాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బుమ్రా బౌలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి కొత్త బంతితో ప్రమాదకరంగా కనిపించిన బుమ్రా.. రెండో కొత్త బంతి అందుకున్న తర్వాత మాత్రం అదే జోరు చూపించలేకపోయాడని విశ్లేషించాడు.


‘మొదటి కొత్త బంతితో బుమ్రా చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేశాడు. కానీ రెండో కొత్త బంతి అందుకున్న తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో బుమ్రా చాలా ప్రమాదకరంగా కనిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తొలి ఓవర్‌లోనే వికెట్లు తీశాడు. కానీ రెండో టెస్టులో అతడి బౌలింగ్‌లో పేస్ తగ్గింది. ముఖ్యంగా రెండో కొత్త బంతి అందుకున్న తర్వాత పదును కనిపించలేదు. అప్పటికే బుమ్రా 15-16 ఓవర్లు బౌలింగ్ చేసి ఉండొచ్చు. బహుశా ఆ ప్రభావం అతడిపై కనిపించి ఉండవచ్చు. ఇక్కడే భారత్ ఇబ్బంది పడుతోంది. రెండో కొత్త బంతితో వికెట్లు తీయలేకపోతే బౌలర్లు మరింత ఎక్కువ సమయం మైదానంలో గడపాల్సి ఉంటుంది. బుమ్రా రన్అప్‌లోనూ మార్పులు చేశాడు. దాని వెనుక వ్యూహం ఉండొచ్చు. రెండోసారి రన్‌అప్ ప్రారంభించినప్పుడు అతడి ముఖంపై చిరునవ్వు కనిపించింది. కొన్నిసార్లు బౌలర్లు బ్యాటర్‌ను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు’ అని గావస్కర్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

38 ఏళ్లకే.. WWE స్టార్ బ్రాన్సన్ కన్నుమూత

బుమ్రా బౌలింగ్‌లో మార్పు.. టీమిండియాకు ఇది మంచిది కాదు: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 28 , 2026 | 12:50 PM